గుండెపోటుతో విద్యార్థి మృతి
WNP: గోపాల్ పేట మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌లో ఏదుట్ల గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి భరత్(14) సోమవారం గుండెపోటుతో చనిపోయాడు. ఉదయం ఏడు గంటలకు చదువుకోవడానికి ఆవరణలో కూర్చున్న బాలుడు 10 నిమిషాల తర్వాత కుప్పకూలాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.