విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సీపీఎం ధర్నా

విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సీపీఎం ధర్నా

ATP: గుంతకల్లు సీఐటీయూ కాలనీలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. పట్టణ అధ్యక్షుడు మారుతి మాట్లాడుతూ.. విద్యుత్ స్తంభాలు లేక కాలనీలో అంధకారంగా ఉందని అధికారులు స్పందించి నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు.