VIDEO: త్రాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు
కోనసీమ: కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామం షేర్ గూడెం వద్ద ప్రజలు గత రెండు సంవత్సరాలుగా తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామస్తులు బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. తమ ప్రాంతంలో ఉన్న తాగునీటి సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించి, త్రాగునీటిని సరఫరా చేయాలని వారంతా డిమాండ్ చేశారు.