పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

SRCL: చందుర్తి మండలం దేవుని తండ, జలపతి తండాలో కురిసిన వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మనో ధైర్యాన్ని కల్పించారు. ఆదివారం ఎమ్మెల్యే పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంట రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి, మాజీ జడ్పీటీసీ నాగంకు, బీసీ నాయకులు ఉన్నారు.