ఇచ్చిన మాట నెరవేర్చుకున్న ఎమ్మెల్యే

ELR: ఉంగుటూరు ఎమ్మెల్యే పత్స మట్ల ధర్మరాజు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. స్థానిక హై స్కూల్‌లో ఉన్న భవిత దివ్యాంగుల పాఠశాల పిల్లలకు మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారని ఆ పాఠశాల విలీన ఉపాధ్యాయుడు రాజు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే మరుగుదొడ్ల విషయాన్ని ఎంపీడీవోకు ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశంతో ఎంపీపీ నిధులుతో పనులు జరుగుతున్నాయన్నారు.