ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

VZM: కొత్తవలస ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో శ్రీదేవి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం ఎందరో వీరులు ప్రాణత్యాగం చేశారని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.