VIDEO: PM పర్యటన విజయవంతం చేద్దాం: ఎంపి
NDL: ఈ నెల 16న జిల్లాకు రానున్న భారత ప్రదాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేద్దాం అని ఎంపి శబరి కోరారు. ఇవాళ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ ఛైర్మన్, పాలకమండలి సభ్యులతో కలిసి శ్రీ మల్లికార్జున స్వామి వార్లను ఆమె దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో, అర్చకులు శేష వస్త్రాలతో సన్మానం చేసి, తీర్థం ప్రసాదం, అమ్మవార్ల చిత్రపటంలు అందించి ఆశీర్వదించారు.