నేడే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష..!

నేడే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష..!

MDK: రేగోడ్ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపారు. ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు 96 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఏడవ తరగతికి 4గురు, 8, 9వ తరగతులకు ఇద్దరు చొప్పున పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. 10AM-12PM ఆరవ తరగతి పరీక్ష ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం 2 PM-4PM వరకు 7-10 తరగతులకు పరీక్ష ఉంటుందన్నారు.