సౌత్ ఇండియా టోర్నమెంటుకు మగ్గిడి పూర్వ విద్యార్థులు

NZB: సౌత్ ఇండియా యూనివర్సిటీ టోర్నమెంట్‌కు ఆర్మూర్ మండలం మగ్గిడి పాఠశాల పూర్వ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 7 నుండి 11వ తేదీ వరకు చెన్నైలో జరిగే వాలీబాల్ సౌత్ ఇండియా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ బాలికల విభాగంలో పూర్వ విద్యార్థినిలు నవీన, కీర్తి పాల్గొననున్నారని PD మధు తెలిపారు. వీరు ఎంపిక పట్ల మాజీ సర్పంచ్ సుమలత, ప్రిన్సిపాల్ హరిత హర్షం వ్యక్తం చేశారు.