లోకో రన్నింగ్ ఉద్యోగుల సామూహిక నిరసన దీక్ష

లోకో రన్నింగ్ ఉద్యోగుల సామూహిక నిరసన దీక్ష

MNCL: బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం AILRS ఆధ్వర్యంలో లోకో రన్నింగ్ ఉద్యోగులు మంగళవారం సామూహిక నిరసన దీక్ష చేశారు. రన్నింగ్ సిబ్బంది పని గంటలు తగ్గించాలని, వారాంతపు విశ్రాంతి సెలవులు ఇవ్వాలన్నారు. బయట స్టేషన్ విశ్రాంతి (8+2) గంటలు అమలు చేయాలని, హెడ్ క్వార్టర్ విశ్రాంతి ( 16+2) గంటలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.