'ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి'

'ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి'

ADB: రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష సూచించారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడారు. సెల్‌ఫోన్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్, అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజలు బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి ప్రమాద రహిత సమాజం నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.