మాజీ ఎంపీ నందిగాంపై కేసు నమోదు

మాజీ ఎంపీ నందిగాంపై కేసు నమోదు

GNTR: తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరులో మాజీ ఎంపీ నందిగాం సురేష్‌పై కేసు నమోదైంది. కాకినాడలోని చర్చ్ ట్రస్టు రెన్యువల్ చేయిస్తానని చెప్పి, విజయవాడకు చెందిన షేక్ మౌలాలి నుంచి రూ. 25 లక్షలు తీసుకున్నట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. మొత్తం పనికి రూ. 2.5 కోట్లు అడిగి, అడ్వాన్స్‌గా రూ. 25 లక్షలు తీసుకుని పని చేయలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.