నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్యాయత్నం
SRD: జిల్లాలో విషాద ఘటన జరిగింది. సదాశివపేట మండలం ఎన్కేపల్లి సమీపంలో ఇవాళ విజయలక్ష్మి(45) అనే మహిళ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. సిబ్బంది ఆమెని హుటాహుటినా మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, విజయలక్ష్మి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.