పలు రైళ్లను రద్దు చేసిన అధికారులు
KNR: మందమర్రి రైల్వే స్టేషన్ వద్ద మూడో లైన్ పనులు జరుగుతున్నందున జనవరి 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు పలు రైళ్లు రద్దు కానున్నాయి. సిర్పూర్ టౌన్-కరీంనగర్, కాజీపేట- సిర్పూర్ కాగజ్నగర్ ప్యాసింజర్, కాజీపేట - బల్లార్ష రామగిరి ప్యాసింజర్, సిర్పూర్ కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ అప్- డౌన్ రైళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.