పీఏసీఎస్ సీఈఓ పై చర్యలు తీసుకోవాలి

నల్గొండ: మఠంపల్లి పరపతి సహకార సంఘం సీఈఓ బత్తుల తిరపతయ్య పై చర్యలు తీసుకోవాలని డీసీఓ కు ఫిర్యాదు చేసినట్లు పలువురు పీఏసీఎస్ డైరెక్టర్లు, రైతులు తెలిపారు. వారు మాట్లాడుతూ... తిరపతయ్య సంఘంలో దందా చేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడన్నారు. అతనిపై విచారణ జరిపి, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు.