యుద్ధం.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ లేఖ రాసింది. ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇరాన్ మతబోదకుల ప్రసంగాలపై దృష్టి పెట్టాలని సూచించింది. నిన్న కశ్మీర్, లక్నోలో షియా వర్గీయులు నిరసనలు చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ సూచనలు చేసింది. కశ్మీర్‌లో ఆందోళనలు చేయడంతో పోలీసులు ఆంక్షలు విధించారు.