VIDEO: విద్యుత్ స్తంభంలో చెలరేగిన మంటలు
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని ఏబీఎన్ పాలెం ఎమ్మార్సీ బిల్డింగ్ వెనుక విద్యుత్ స్తంభంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.