విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

MDK: రేగోడ్ మండలం చౌదర్ పల్లిలోని MPPSలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు బోధించారు. కొందరు విద్యార్థులు అధికారులుగా మారి పాఠశాల పరిపాలనను నిర్వహించి ప్రతిభ చాటారు. MEOగా అరుణ్ కుమార్, HMగా వరుణ్ తేజ్, PETగా రఘువరన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విద్యార్థులను HM అజయ్, టీచర్ సారిక అభినందించారు.