రిజర్వేషన్ కౌంటర్‌పై డిపో మేనేజర్ స్పందన
KDP: జమ్మలమడుగు ఆర్టీసీ డిపోలో మూతపడిన ప్రయాణికుల రిజర్వేషన్ కౌంటర్‌ను ఏప్రిల్‌లో టెండర్ పిలిచి అప్పగిస్తామని డిపో మేనేజర్ సుబ్బమ్మ తెలిపారు. గతంలో కౌంటర్ తీసుకున్న వ్యక్తి వద్దని రాతపూర్వకంగా ఇవ్వడంతో ఆలస్యం జరిగిందన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు.