నిరుపయోగంగా పశువుల నీటి తొట్టెలు

నిరుపయోగంగా పశువుల నీటి తొట్టెలు

KDP: మైదుకూరు మండలం డాన్ ఖాన్ పల్లెలో పశువుల దాహం తీర్చడం కోసం ఏర్పాటుచేసిన నీటి తొట్లు అలంకారప్రాయంగా ఉంటున్నాయి. నీటి వసతికి నోచుకోక నిరుపయోగంగా ఉండి పోతున్నాయి. ప్రస్తుతం వేసవి మొదలవుతుందని, నీటి కనెక్షన్ ఏర్పాటు చేస్తే పశువుల దాహంకు ఇబ్బందులు ఉండవని పాడి రైతులు అంటున్నారు. పంచాయతీ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.