లబ్థిదారులకు ఎల్‌‌వోసీ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

లబ్థిదారులకు ఎల్‌‌వోసీ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: సీఎం సహాయ నిధి పేదలకు వరమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. విజయవాడలో మంగళవారం ఇద్దరు లబ్ధిదారులకు ఎల్‌‌వోసీ పత్రాలు అందజేశారు. మడిచర్లకు చెందిన ఆరోగ్యమ్మకు రూ.76,802, నున్న గ్రామానికి చెందిన పాపకు రూ.1,34,428 వైద్య సహాయం నిమిత్తం ఈ చెక్కులు మంజూరయ్యాయి. ఆపదలో ఉన్న వారికి ఈ నిధి పెద్ద అండగా నిలుస్తోందని పేర్కొన్నారు