రేపు ఆరోగ్య సురక్ష కార్యక్రమం

నెల్లూరు: రేపు మంగళవారం ఉదయగిరి మండల పరిధిలోని కృష్ణంపల్లిలో ఆరోగ్య సురక్ష -2 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో డి. ఈశ్వరమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని కృష్ణంపల్లి సచివాలయ పరిధిలోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో ఉచితంగా పలు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారన్నారు.