కోచ్ గంభీర్‌కు గవాస్కర్ మద్దతు
దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా టెస్టు సిరీస్‌ను కోల్పోవడంతో కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం గవాస్కర్, గంభీర్‌కు మద్దతుగా నిలిచాడు. కోచ్ ఆటగాళ్లు ఏ విధంగా ఆడాలో మాత్రమే చెప్పగలడు కానీ, మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే అని తెలిపాడు. గంభీర్ కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచిందని గుర్తుచేశాడు.