రైతులకు అందుబాటులో యూరియా

రైతులకు అందుబాటులో యూరియా

VZM: జిల్లాలో 6,000 టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. మంగళవారం తన ఛాంబర్‌లో వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 40 వేల హెక్టార్లకు సుమారు 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని, ఇప్పటివరకు 21 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు వినియోగించారని చెప్పారు. యూరియా కొరకు రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.