రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
KDP: బద్వేల్ సమీపంలోని సెంచరీ ప్యానల్ వద్ద కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు అట్లూరు మండలం మనిలేని పట్టణానికి చెందిన కేశవగా గుర్తించారు. మరో యువకుడు నాగదాసరి శివకేశవులుగా సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.