పాకిస్తాన్ ట్రై సిరీస్.. శ్రీలంకకు బిగ్ షాక్

పాకిస్తాన్ ట్రై సిరీస్.. శ్రీలంకకు బిగ్ షాక్

పాకిస్తాన్‌లో రేపటి నుంచి ప్రారంభం కానున్న ముక్కోణపు సిరీస్‌కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఈ టోర్నీకి ఆ జట్టు కెప్టెన్ చరిత్ అసలంక అనారోగ్యంతో దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్ దసున్ శనక సారథ్య బాధ్యతలు వహించనున్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. అసలంకతో పాటు ఫాస్ట్ బౌలర్ అసిత ఫెర్నాండో కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.