రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా: కమిషనర్
BHNG: భువనగిరి ప్రజలకు మున్సిపల్ అధికారులు కీలక సూచన చేశారు. ఇళ్లు, వ్యాపార సంస్థల చెత్తను కేవలం మున్సిపల్ స్వచ్ఛ ఆటోలకు మాత్రమే అందజేయాలని కమిషనర్ రామలింగం ఆదేశించారు. రోడ్లపై, ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం వల్ల కుక్కలు, కోతులు స్వైరవిహారం చేస్తూ ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.