గోడకు రంధ్రం చేసి వెండి ఆభరణాలు చోరీ

గోడకు రంధ్రం చేసి వెండి ఆభరణాలు చోరీ

HYD: నగల దుకాణం గోడకు రంధ్రం చేసి వెండి ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన దుండిగల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బౌరంపేట్‌లోని ఓ జ్యువెలరీ షాపు పక్కన రూమ్‌ని అద్దెకు తీసుకున్న ఇద్దరు దొంగలు గోడకు రంధ్రం చేసి షాపులోకి చొరబడి 15 కిలోల వెండి ఆభరణాలు, సామగ్రిని దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.