రైళ్ల పై రాళ్లు విసిరిన వ్యక్తి అరెస్ట్

మేడ్చల్: మల్కాజిగిరి రైల్వే స్టేషన్ పరిధిలో వెళ్లే రైళ్ల పై రాళ్లు విసిరిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు తెలియజేశారు. ప్రయాణికుల భద్రత నేపథ్యంలో చట్ట ప్రకారంగా వివిధ సెక్షన్ల పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత ముఖ్యమని, రైళ్ల పై రాళ్లు విసిరితే చట్టపరంగా చర్యలు తప్పవని శనివారం హెచ్చరించారు.