నాగార్జునసాగర్‌కు RTC టూర్ ప్యాకేజీ

నాగార్జునసాగర్‌కు RTC టూర్ ప్యాకేజీ

HYD: నాగార్జునసాగర్, ఎత్తిపోతల ప్రాజెక్ట్ సందర్శనకు ఒకరోజు టూర్ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు మియాపూర్ RTC-1 డిపో DM మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24న ఉ. 5 గం.కు మియాపూర్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు బయల్దేరి సాగర్, ఎత్తిపోతల ప్రాజెక్టులను సందర్శించి రాత్రి 8 గం.కు తిరిగి మియాపూర్‌కు చేరుకుంటుందని వివరించారు. ఇతర వివరాలకు 8500309052ను సంప్రదించాలన్నారు.