VIDEO: రైతులకు నష్టం కాదు, లాభం రావాలి: ఎమ్మెల్యే

VIDEO: రైతులకు నష్టం కాదు, లాభం రావాలి: ఎమ్మెల్యే

GDWL: రైతులకు నష్టం వచ్చేలా కాకుండా, లాభాలు వచ్చేలా అధికారులు సమన్వయం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అధికారులను ఆదేశించాడు. సోమవారం ఎర్రవల్లి మండలం బీచుపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మద్దతు ధరకు కొనుగోలు చేసే ఏర్పాట్లపై ఆరా తీశాడు. రైతులకు ఉపయోగకరంగా ఈ కేంద్రం ఉండాలని ఎమ్మెల్యే అధికారులను కోరాడు.