'చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు'
KMM: పెనుబల్లి మండలం ఏరుగట్ల సమస్యాత్మక గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కల్లూరు ఏసీపీ, సీఐ సత్తుపల్లి రూరల్, ఎస్సై కే.వెంకటేష్ గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. రెచ్చగొట్టే విధంగా, గొడవలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు కోరారు.