సేవా భారతి సంస్థ సేవలు ప్రశంసనీయం
CTR: సమాజాభివృద్ధిలో సేవా భారతి సంస్థ సేవలు ప్రశంసనీయమని విజయపురం మండలం పన్నూరు ఐటీఐ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ లలిత కుమారి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సేవా భారతి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలలో పోటీలను నిర్వహించారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు.