T20 WC: నేడే ఫైనల్.. గెలుపెవరిదో?
కోట్లాది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న T20 WC 2026 ఫైనల్ మ్యాచ్ ఇవాళ సా.7 గంటలకు ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. T20 WC చరిత్రలో ఈ జట్లు ఫైనల్‌లో నిలవడం ఇదే తొలిసారి. అయితే, ICC నిర్వహించిన వన్డే, టెస్టు ఫార్మాట్లలో మూడుసార్లు ఫైనల్‌లో తలపడ్డాయి. వాటిలో న్యూజిలాండ్ 2 సార్లు, భారత్ ఒకసారి గెలిచింది.