నిజాలు తెలుసుకుని రాయండి: రకుల్ ప్రీత్
రకుల్ ప్రీత్ సింగ్ తన అత్తింటివారు దివాలా తీశారంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా స్పందించింది. తన భర్త జాకీ భగ్నానీ నిర్మాతగా తీసిన 3 చిత్రాలు విఫలమైనంత మాత్రాన.. దివాలా తీశారని ప్రచారం చేయడం ఏంటని ఆమె ప్రశ్నించింది. నిజానిజాలు తెలుసుకుని వార్తలు రాయాలని మండిపడింది. ఇండస్ట్రీలో ఇలాంటి వైఫల్యాలు అందరికీ ఎదురవుతాయని ఆమె స్పష్టం చేసింది. వదంతులను నమ్మవద్దని అభిమానులను కోరింది.