మీ పెళ్లి ఎప్పుడు రాహుల్?.. బాలుడి ప్రశ్న

మీ పెళ్లి ఎప్పుడు రాహుల్?.. బాలుడి ప్రశ్న

బీహార్‌ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అరారియాలో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వద్దకు ఓ బాలుడు వచ్చాడు. అతడిని ఆప్యాయంగా పలకరించిన రాహుల్ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మీరు ఎప్పుడు పెళ్లిచేసుకుంటారని రాహుల్‌ను ఆ బాలుడు ప్రశ్నించాడు. అందుకు రాహుల్ నవ్వుతూ తన పని పూర్తి అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు.