ప్రతీ ఒక్కరికీ న్యాయం చేస్తా: నారాయణ

ప్రతీ ఒక్కరికీ న్యాయం చేస్తా: నారాయణ

నెల్లూరు: జిల్లాలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం కార్పొరేషన్ అధికారులు, పార్టీ శ్రేణులతో మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు. ఒకదాని తర్వాత ఒకటి చేసుకొంటూ వెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు.