ఎగువ గూలూరులో క్యాండిల్ లైట్ సర్వీసు
TPT: పుత్తూరు మండలం ఎగువ గూలూరు ఈసీఐ చర్చిలో ఆదివారం ఉదయం క్యాండిల్ లైట్ సర్వీసు ఆచరించారు. సాధారణంగా క్రిస్మస్ కు ముందు అడ్వెంట్ ఆచారంలో భాగంగా స్త్రీల క్యాండిల్ లైట్ సర్వీసు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు చర్చి ఫాదర్ మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా క్రిస్మస్ చేసుకోవాలని సూచించారు.