బజార్ ఏరియా సమస్యలు పరిష్కరించాలని వినతి

బజార్ ఏరియా సమస్యలు పరిష్కరించాలని వినతి

MNCL: బెల్లంపల్లి బజార్ ఏరియాలో డ్రైనేజీ, రోడ్లు, పరిసరాలు పరిశుభ్రత ఉండేలా చూడాలని వార్డు ప్రజలు కోరారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డికి 29వ వార్డు కౌన్సిలర్ పున్నం చందు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. డ్రైనేజీల్లో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందన్నారు. రోడ్లపై ఇసుక చేరుకుపోయి వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని వివరించారు.