ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

SRCL: వేములవాడ ఏరియా ఆసుపత్రిని ఆదివారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు రోగులను పరామర్శించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు . మెరుగైన వైద్యమును అందించాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని ప్రజలందరూ ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని కోరారు.