విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి

విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి

SDPT: కొండపాక మండలం రవీంద్రనగర్ పంచాయతీలో విద్యుత్ షాక్‌తో తోకల కనకయ్య మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో విద్యుత్ సరఫరాను పరిశీలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని గజ్వేల్ మార్చురీకి తరలించగా, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.