నూతన సెల్ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి
WNP: అంగన్‌వాడీ టీచర్లు ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించి విధి నిర్వహణను మరింత సులభతరం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. సోమవారం అమరచింతలో అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్‌ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. గతంలో ఉన్న ఫోన్లు సరిగా పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.