VIDEO: అర్థనగ్న ప్రదర్శన చేపట్టిన కార్మికులు

CTR: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్‌లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ.. పుంగనూరులో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగానే అర్థనగ్న ప్రదర్శనతో నిరసన చేశారు. కనీస వేతనం రూ.29 వేలుగా నిర్ణయించాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.