టీడీపీ నుండి వైసీపీలో చేరికలు

గుంటూరు: వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో చాట్రగడ్డపాడు గ్రామస్తులు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో టీడీపీ నుండి వైసీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొల్లా మాట్లాడుతూ..పార్టీ చేరిన ప్రతి ఒక్కరూ వైసీపీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు.