'ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి'
CTR: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ క్యాడర్‌పై ఉందని RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. కుప్పం మండల TDP ముఖ్య నేతల సమావేశం శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పార్టీ శ్రేణులు ముందుండాలన్నారు.