రక్తదానంతో ప్రాణాలు కాపాడిన శునకం

BPT: ఓ శునకం ప్రాణాలను మరో శునకం కాపాడిన అరుదైన ఘటన చీరాలలో గురువారం వేకువజామున జరిగింది. సైబీరియన్ జాతికి చెందిన శునకం అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హిమోగ్లోబిన్ శాతం తగ్గినట్లు గుర్తించిన కారంచేడు ప్రభుత్వ పశువైద్యాధికారి భాగ్యరాజు మరొక కుక్క నుంచి రక్తాన్ని తీసి ఎక్కించారు. ప్రస్తుతం రెండూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.