‘వైద్యసేవలు ప్రజలకు మరింత విస్తృతం చేయాలి’

‘వైద్యసేవలు ప్రజలకు మరింత విస్తృతం చేయాలి’

VZM: పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలలో వైద్యసేవలు సక్రమంగా అందిస్తూ, ఔట్ పేషెంట్‌ల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య సేవలను ప్రజలకు మరింత విస్తృతం చేయాలని కలెక్టర్ సూచించారు.