వైద్యం కావాలంటే.. 4 గం.లు నిలబడాల్సిందే..!

HYD: ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో వైద్యం కోసం గంటల తరబడి లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అక్కడికి వెళ్లిన రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు 120 నుంచి 150 వరకు వచ్చే అవుట్ పేషంట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన తాము, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.