యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సిగిరి అంజిత్ కుమార్

జగిత్యాల: బుగ్గారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సిగిరి అంజిత్ కుమార్ ఎన్నికయ్యారు. బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్ష పదవికి ఆన్ లైన్ ద్వారా ఇటీవల ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారు. గురువారం వెలువడిన ఆన్‌లైన్ ఫలితాలలో ప్రత్యర్థి రెంటం శ్రీధర్‌పై సిగిరి అంజిత్ కుమార్ 213 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.