కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్లు

ఆపరేషన్ సింధూర్ ప్రభావం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లపై పడింది. భారత్ దాడి చేసిన నేపథ్యంలో పాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ దేశ మార్కెట్ ఇండెక్స్ కరాచీ భారీగా క్షీణించింది. దాదాపు 6 శాతం మేర నష్టపోయాయి. కాగా, పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్.. పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.